మనిషి కులాన్ని డిసైడ్ చేస్తున్న చర్మం రంగు : తనిష్టా ఛటర్జీ

by Jakkula Samataha |
మనిషి కులాన్ని డిసైడ్ చేస్తున్న చర్మం రంగు : తనిష్టా ఛటర్జీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్, డైరెక్టర్ తనిష్టా ఛటర్జీ జాత్యహంకారం గురించి మాట్లాడేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. 2015లో తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కామెడీ షోకు అటెండ్ అయిన ఆమె.. రేసిజంపై జోక్స్ వేయడంపై ఫైర్ అవుతూ షో నుంచి వాక్ అవుట్ చేసి అందరి అటెన్షన్ క్యాచ్ చేసింది. కాగా ప్రస్తుత సమాజంలో చర్మం రంగు ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది తనిష్ట.

ఫెయిర్ స్కిన్, బ్రౌన్/డార్క్ స్కిన్ అంటూ ఎలా తేడా చూపిస్తారు, శరీరం రంగును బట్టి మనుషులకు సమాజంలో ఎలాంటి గౌరవం దక్కుతుందనే విషయాన్ని వివరించింది. ముఖ్యంగా చర్మం రంగు అనేది దేశంలో నాటుకుపోయినా కులవ్యవస్థ మీద ఆధారపడి ఉందన్న తనిష్ట.. ఫెయిర్ స్కిన్ ఉన్న వ్యక్తి ఉన్నత కులానికి చెందిన వాడని డిసైడ్ అయిపోతున్నారని, అలాంటి వ్యక్తికి ఎక్కడలేని గౌరవం ఇస్తారని తెలిపింది. అదే డార్క్ స్కిన్ ఉండి అప్పర్ క్యాస్ట్‌కు చెందినవాడు అయినా సరే… లోయర్ కాస్ట్ అనే నిర్ణయానికి వచ్చేసి పూచికపుల్లతో సమానంగా చూస్తారని అభిప్రాయపడింది. ఇదంతా మనం మైనార్టీలను, వెనుకబడిన కులాలను ద్వేషించడం నుంచి వచ్చిందని, ఈ విషయంలో మార్పు రావాలంటే చాలా సమయం పడుతుందని తెలిపింది.

Advertisement

Next Story