డ్రగ్స్ కేసుపై క్లారిటీ.. ఎమోషనల్ అయిన తనీష్

by Shyam |   ( Updated:2023-07-08 13:00:20.0  )
Tanish
X

దిశ, సినిమా: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశాడు తనీష్. నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటి ఫేక్ న్యూస్ ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించాడు. ఈ వార్తలు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయన్నాడు. డ్రగ్స్ కేసులో బెంగళూరుకు చెందిన నిర్మాతతో పాటు తనకు కూడా నోటీసులు అందడం నిజమే కానీ అందులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడి నెగెటివ్‌గా ప్రచారం చేయడం బాగా లేదన్నాడు. ఆ నోటీసులో.. ‘డ్రగ్స్ కేసు, నిర్మాత గురించి మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి’ అని మాత్రమే ఉందని పేర్కొన్నారు. అంతేకాని తను ఇన్వాల్వ్ అయ్యానని నోటీస్ పంపలేదన్నారు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయకుండా, తన దగ్గర ఇన్‌ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుందన్నారు తనీష్. బెంగళూరుకు చెందిన సదరు నిర్మాత తనతో ప్రాజెక్ట్ చేస్తానని సంప్రదించినా.. అది టేకాఫ్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. అవకాశాల కోసం ఎందరినో కలుస్తుంటాం.. వారిలో తను కూడా ఒకరని స్పష్టం చేశాడు. నిర్మాతతో రెండేళ్లుగా కాంటాక్ట్‌లో కూడా లేనని, దయచేసి డ్రగ్స్ కేసుతో ముడిపెట్టకూడదని కోరాడు.

Advertisement

Next Story