- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘనంగా ప్రకాశం పంతులు 149వ జయంతి
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సూచించారు. ఆదివారం స్థానిక ఒంగోలు ప్రకాశం భవనంలో టంగుటూరి ప్రకాశo పంతులు 149 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కడు పేదరికంలో పుట్టినప్పుటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారన్నారు. మహోన్నత ఆశయాలతో జీవితాన్ని కొనసాగించినట్లు తెలిపారు. స్వాతంత్రోద్యమంలో సైమన్ కమిషన్ తుపాకులకు ఎదురు నిలిచిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి గా ఆయన పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణను శాలువాతో సన్మానించారు.