రైతులకు కోపం వస్తే ప్రభుత్వాలకు మోడీకి పట్టిన గతి పడుతుంది.. తమ్మినేని వీరభద్రం

by Shyam |
Tammineni Veerabhadram
X

దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీ సమావేశంలో ఆయన తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాంతో కలసి మాట్లాడారు. రైతులకు కోపం వస్తే ప్రభుత్వాల పీఠాలు కదులుతాయని, మోదీ చేసిన రైతు చట్టాల రద్దే ఇందుకు నిదర్శనమన్నారు. చట్టాలు రద్దు చేసిన పాలకులు పంటల సాగు‌పై ఆంక్షలు విధించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎక్కడి పంటలు అక్కడ సాగు చేసే స్వేచ్ఛను హరించడం ద్వారా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.

cpm

తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం మాడ్గులపల్లి, కుక్కడం ఐకేపీ కేంద్రాలను పరిశీలించి రైతులు పండించిన ధాన్యం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా యాసంగిలో నీటి విడుదల, వరిసాగు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీలో జరిగిన అఖిలపక్ష పార్టీల ర్యాలీలో సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed