- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
131 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన తమీమ్ ఇక్బాల్
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ 131 ఏళ్ల టెస్టు రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంక పర్యటనలో పల్లెకలెలో తొలి టెస్టు చివరి రోజు అతడు అర్ద సెంచరీ సాధించాడు. తమీమ్ ఇక్బాల్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ 52/2. ఒక జట్టు అత్యల్ప స్కోర్ చేసినప్పుడు అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మాన్‌గా తమీమ్ ఇక్బాల్ రికార్డులకు ఎక్కాడు.
ఇన్నింగ్స్‌లో తమీమ్ 50 పరుగులు చేయగా మిగతా ఇద్దరు 2 పరుగులు చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన జేజే లయన్స్ ఇంగ్లాండ్‌పై అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 55 మాత్రమే. 2014లో న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టులో క్రిస్ గేల్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న సమయానికి వెస్టిండీస్ స్కోర్ 55 మాత్రమే. కాగా, టెస్టు క్రికెట్‌లో తమీమ్ ఇక్బాల్‌కు ఇది 30వ అర్ద సెంచరీ. వర్షం కారణంగా చివరి సెషన్ రద్దు కావడంతో బంగ్లా, శ్రీలంక తొలి టెస్టు డ్రాగా ముగిసింది.