- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతిపై అత్యాచారం చేయబోయిన అతడిని కుక్క ఎక్కడ కరిచిందంటే..?
దిశ, వెబ్ డెస్క్ : కుక్క కున్న విశ్వాసం మరే జంతువుకు ఉండదు. ఒక్కసారి కడుపునిండా భోజనం పెడితే అది చనిపోయేవరకు వారిపై విశ్వాసం చూపిస్తూనే ఉంటుంది. అందుకే కుక్కను విశ్వాసానికి మారుపేరుగా చెప్తారు. తాజాగా ఒక కుక్క తన విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది. కన్నా తల్లిదండ్రులే కాదని కాలదన్నిన ఒక వికలాంగురాలి మాన ప్రాణాలను కాపాడి అందరిచేత శబాష్ అనిపించుకుంటుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు లో చోటుచేసుకుంది.
కోయంబత్తూరు న సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి దానిలో ఉంచారు. రోజు తిండి, నీళ్లు తప్ప ఆమెను పలకరించే దిక్కు లేదు. ఆ ఇంట్లో ఒక కాపలా కుక్కే ఆమె కు నేస్తం. అయితే ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఆ వికలాంగురాలి పై కన్ను వేశాడు. ఆ రేకులషెడ్డులో ఎవరు లేని సమయంలోకి దూరి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుక్క నెమ్మదిగా ఆ షెడ్డులోకి వెళ్లి అతడి ప్యాంటు పట్టుకొని బయటికి లాగుతూ గట్టిగా మొరగడం ప్రారంభించింది. దీంతో భయపడ్డ దిలీప్ బయటికి పరుగులు తీసాడు. అయిన కుక్క అతడి వెంట పడి పట్టుకొని కరవడం ప్రారంభించింది. కుక్క అరుపులు విన్న తల్లిదండ్రులు బయటికి వచ్చి జరిగింది గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కన్న తల్లిదండ్రులే మానసిక వికలాంగురాలని తలచి రేకుల షెడ్డులో పడేస్తే అన్నం పెట్టి ఆదరించినందుకు విశ్వాసంగా ఆ యువతీ ప్రాణాలు కాపాడిన కుక్కను అందరు మెచ్చుకున్నారు. కన్నకూతురిని రేకుల షెడ్డులో పెట్టినందుకు ఆ తల్లిదండ్రులను స్థానికులు తిట్టిపోస్తున్నారు.