తిరుపతిలో తమిళనాడు జర్నలిస్టు మృతి

by srinivas |
తిరుపతిలో తమిళనాడు జర్నలిస్టు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: తమిళనాడుకు చెందిన జర్నలిస్టును కరోనా మహమ్మారి ఏపీలో బలితీసుకుంది. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన మణి తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రత పెరగడంతో.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో సహచర జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రిపోర్టింగ్‌కు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు జర్నలిస్టులు కరోనా కారణంగా మృతి చెందగా, వారిలో ఇద్దరు కడప జిల్లా వారు కాగా, తమిళనాడుకి చెందిన మణి తిరుపతిలో పని చేస్తూ మృతి చెందాడు.

Advertisement

Next Story