తమిళ రాష్ట్ర గీతంగా ‘తమిళ్ తాయి’

by Shamantha N |
CM Stalin
X

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ తల్లిని గొప్పతనాన్ని అభివర్ణిస్తూ రాసిన తమిళ్ తాయి వాజుతును రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ పాట వినిపించినప్పుడు తప్పనిసరిగా లేచి నిల్చొని, గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు. ఇటీవలే మద్రాస్ హైకోర్టు దీనిని కేవలం ప్రార్థన గీతం మాత్రమేనని జాతీయ గీతం కాదని పేర్కొంది. అంతేకాకుండా ఈ పాట వినగానే ఎవరూ లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర గీతంగా నిర్ణయిస్తూ నూతన జీవోను జారీ చేశారు. నిల్చోవడానికి వీలులేని వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆధీనంలోని కార్యాలయాల్లో ఆలపించాలని పేర్కొంది.

Advertisement

Next Story