సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు శ్రీకాంత్ కన్నుమూత

by Shyam |   ( Updated:2021-10-12 22:49:10.0  )
Srikanth-1
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్(82) కన్నుమూశారు. చెన్నైలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొన్నది. ఈ విషయం తెలిసి ప్రముఖులు, రాజకీయ నేతలు.. శ్రీకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. పవర్ స్టార్ రజినీకాంత్ కూడా మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. “నా ప్రియమైన స్నేహితుడు శ్రీకాంత్ మృతి పట్ల నేను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి” అని తమిళంలో రజనీకాంత్ ట్వీట్ చేశారు.

1965లో వెన్నిరా ఆడై మూవీతో సినీ ప్రవేశం చేసిన శ్రీకాంత్ 200 లకు పైగా చిత్రాల్లో నటించాడు. రజినీకాంత్, శివాజీ గణేషన్, ఆర్ ముత్తురామన్, శివకుమార్, కమల్ హాసన్ తో కూడా శ్రీకాంత్ కలిసి నటించాడు.

Advertisement

Next Story