ఉరేసుకుని సినీ నటుడు ఆత్మహత్య… విషాదంలో సినీ ఇండస్ట్రీ

by Anukaran |   ( Updated:2021-04-12 22:03:59.0  )
ఉరేసుకుని సినీ నటుడు ఆత్మహత్య… విషాదంలో సినీ ఇండస్ట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత కుమారజన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తన ఇంట్లో అతడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.

గతంలో సాంతిఫ్పొమ్ సింతిప్పొమ్ అనే సినిమాను కుమారజన్ నిర్మించాడు. ఆ సినిమాలో అతడే హీరో. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story