రూ. 3 కోట్లు ఇస్తే ఒకే…

by Jakkula Samataha |
రూ. 3 కోట్లు ఇస్తే ఒకే…
X

తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడిన మిల్కీ బ్యూటీ తమన్నా.. కొత్త హీరోయిన్ల హవాతో కాస్త జోరు తగ్గించింది. ఒకప్పుడు బిజీ షెడ్యూల్‌ మెయింటైన్ చేసిన ఈ భామకు.. ఇప్పుడు చేతిలో రెండు మూడు సినిమాల కన్నా లేవు. అయినా సరే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా బెట్టు చేస్తోందట ఈ అమ్మడు.

విషయం ఏంటంటే.. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్‌గా ‘తమ్మూ బేబీ’ని సంప్రదించారట. కానీ, దీనికోసం ఈ అమ్మడు ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే దర్శక, నిర్మాతలు రూ. 2 కోట్లు ఇస్తామని ఒప్పందానికి వచ్చారట. కానీ, తను మాత్రం అసలు తగ్గలేదట. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే ప్రాజెక్ట్ లేదంటే లేదని చెప్పేసిందట. దీంతో వారు షాక్ అయ్యారట.

బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ సరసన నటించిన మిల్కీ గర్ల్.. మాస్ మహారాజకు ఫ్రెండ్. దీంతో ఈ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనుకున్నా.. ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె నో చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కాగా తమన్నా.. గోపీచంద్ హీరోగా వస్తున్న “సిటీ మార్” సినిమాలో కబడ్డీ కోచ్‌గా కనిపించబోతోంది.

Advertisement

Next Story

Most Viewed