పర్‌ఫెక్ట్‌గా బస్సు నడిపిన తమన్నా..

by Anukaran |   ( Updated:2023-08-18 15:56:15.0  )
పర్‌ఫెక్ట్‌గా బస్సు నడిపిన తమన్నా..
X

దిశ, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం ‘సీటీమార్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే షూటింగ్ టైమ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో తన డ్రైవింగ్ స్కిల్స్ చూపించింది. షూటింగ్ స్పాట్‌లో బస్సు నడిపి మూవీ యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తమన్నాను సూపర్ స్టార్ అని పొగిడేస్తున్నారు. షూటింగ్ డైరీస్‌ను ఇలా ఎంజాయ్ చేస్తున్నావు అంటున్న ఫ్యాన్స్ ఎప్పటికీ ఫైటర్‌గానే ఉంటూ తమను ఇన్‌స్పైర్ చేయాలంటున్నారు.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ సినిమాకు సంపత్ నంది దర్శకులు కాగా, తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది. ప్రజెంట్ ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ జరుగుతుండగా.. తర్వాత యంగ్ హీరో నితిన్ ‘అందాధున్’ రీమేక్‌ షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఈ మూవీలో బోల్డ్ అవాతర్‌లో సరికొత్త యాంగిల్ చూపించనుంది తమ్ము. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.

Advertisement

Next Story

Most Viewed