నేడు బ్రహ్మంగారి మఠానికి మరోసారి పీఠాధిపతులు

by Shyam |
kadapa
X

దిశ, వెబ్‌డెస్క్ : వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి మరోసారి పీఠాధిపతుల బ‌ృందం వెళ్లనుంది. పీఠాధిపత్యం విషయంలో బ్రహ్మంగారి కుంబ సభ్యుల మధ్య వాగ్వాదంతో చర్చనీయాంశమైంది. పీఠాధిపత్యం తమకంటే తమకు అని బ్రహ్మంగారి వారసులు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ పీఠాధిపతి వివాదం పరిష్కారానికి మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ వివాదం పై చర్చించడానికి 20 మంది పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి రానున్నారు.

శనివారం శివ స్వామి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి 20 మంది మఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి వచ్చి రేపు ఉదయం 10 గంటలకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం పీఠాధిపత్యంపై వారసుల అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇందులో భాగంగా విశ్వ బ్రహ్మణ సంఘాల వారి అభిప్రాయాలను కూడా స్వీకరించనున్నారు. ఇప్పటికే 12 మంది తెలుగు రాష్ట్రాల్లో మఠాధిపతులు పీఠముడి విప్పే ప్రయత్నం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు . ఈ రోజు జరగబోయే చర్చలతో కాబోయే పీఠాధిపతి ఎవరు అనే అంశం త్వరలో తేలిపోనుందని, బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం సమస్య ముగింపు దశకు చేరుకున్నట్టేనని శైవక్షేత్ర మఠాధిపతి శివస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed