ఇండియాను టార్గెట్ చేసిన తాలిబన్లు.. కాన్సులేట్ ఆఫీసుల్లో చొరబడి..!

by Sumithra |   ( Updated:2021-08-20 10:25:04.0  )
indian-embassy
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచకం సృష్టిస్తున్న తాలిబన్లు ఇండియాను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆఫ్ఘన్ వదిలి పోయే ప్రజలను తొలుత టార్గెట్ తాలిబన్లు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్మనీ దేశస్తుడు ఒకరు మృతి చెందగా.. ఆ తర్వాత భారత రాయబార కార్యాలయాలపై తాలిబన్లు విరుచుకపడ్డారు.

కాందహార్, హెరాత్ నగరాల్లో భారత రాయబార కార్యలయాలపై దాడులు చేయడమే కాకుండా అందులోని సామగ్రి, వాహనాలు, కీలక పత్రాలను ఎత్తుకెళ్లారు. ఆపై రెండు కాన్సులేట్లలో డోర్ టు డోర్ తనిఖీలు చేసినట్టు సమాచారం. అయితే, ఆఫ్ఘన్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించిన భారత్ జోలికి వెళ్లమని తొలుత ప్రకటించిన తాలిబన్లు.. ఈ రోజు రాయబార కార్యాలయాలపై దాడులు చేయడంపై భారత ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed