- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన తాలిబాన్లు
కాబూల్: పాక్, భారత్ మధ్య గత కొన్ని దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారిన కశ్మీర్‌పై ఉగ్రవాద సంస్థ తాలిబాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్ భారత దేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోమని.. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. గత కొన్నేండ్లుగా కశ్మీర్ ప్రాంతంలో జీహాద్ పేరుతో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్దతు ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తాలిబాన్ నేత సుహైల్ షాహీన్ అన్నారు. తాము ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే విధానాన్ని పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్ వివాదం పరిష్కారం అయ్యే వరకు తాము భారత్‌తో సత్సంబంధాలు పెట్టుకోమని వచ్చిన ప్రకటన అవాస్తవమని అన్నారు. తాము అలాంటి ప్రకటన ఏదీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాలిబాన్ చేసినట్లు వచ్చిన ప్రకటనను భారత్ కూడా కొట్టి పారేసింది.