ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఘాతుకం.. 100 మంది పౌరులు మృతి

by Sumithra |
Taliban militants
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. కందహార్‌ ప్రావిన్స్‌లో పౌరుల ఇళ్లపై మెరుపుదాడి చేశారు. ఇళ్లపై కాల్పులు జరపడంతోపాటు ఇళ్లను దోచుకున్నారు. ఈ దాడిలో దాదాపు వందమందికిపైగా పౌరులు మృతిచెందినట్లు ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు. తాలిబాన్లు స్పిన్ బోల్డాక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు గృహాలు దోచుకుంటూ కాల్పులకు తెగబడ్డారని వీడియో ఫుటేజీలో వెల్లడైంది. ప్రస్తుతం.. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలోని నేలపై పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed