ఎంపీ రఘురామ దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోండి

by srinivas |
MP Raghurama Krishnaraju
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం రఘురామకృష్ణంరాజుకు గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ రెడీ అవుతుంది. రఘురామను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వైసీపీ. అటు రాజద్రోహం కేసుతోపాటు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన.. తాజాగా మనీలాండరింగ్ కేసులతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. మిలియన్ యూరోలు బదిలీ జరిగాయని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను ఎంపీలు మోడీకి అందజేశారు.

రఘురామ దేశం విడిచి పారిపోకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ రఘురామకు, టీవీ5 చైర్మన్‌ నాయుడుకు మధ్య 11 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రఘురామ, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైసీపీ ఎంపీలు ప్రధాని మోడీని కోరారు. మరోవైపు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా ఎంపీ రఘురామపై ఫిర్యాదు చేశారు. రఘురామపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story