పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి

by Sridhar Babu |   ( Updated:2021-08-15 04:53:09.0  )
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి
X

దిశ,మానకొండూరు: స్వతంత్య్రదినోత్సవ వేడుకలకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై ఆగ్రహానికిలోనైన ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శిపై ఎంపీడీఓ‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎంపీటీసీ తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి, ఖాదర్ గూడెం,ఈ రెండు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా బూర్గు రమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. అయితే రెండు గ్రామాలకు ఎంపీటీసీ ఒక్కరే ఉన్న మాకు ఆహ్వానం లేకపోవడం ఎంతో అవమానకరం అన్నారు. ప్రజా ప్రతినిధులుగా కనీసం వాట్సాప్ ద్వారానో చిన్న మెస్సేజ్ ద్వారానో సమాచారం ఇవ్వకపోవడం, పైగా, వేడుకలకు వచ్చేలోగానే జెండా ఆవిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గ్రామాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిపై మాకు సమాచారం ఇవ్వనందుకు చర్యలు తీసుకోవాలని అలాగే కనీస మర్యాద ఇచ్చేలా చూడాలని ఎంపీడీఓను కోరారు.

Advertisement

Next Story