- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాజ్ మహల్ సందర్శకులకు శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ సందర్శనకు సంబంధించి ఆగ్రా పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఉదయం 6 గంటల నుంచే తాజ్ మహల్‌ను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తాజ్ మహల్‌ను సందర్శించేందుకు అనుమతి ఉంది. కానీ సూర్యోదయం వేళలో తాజ్ మహల్‌ను చూసేందుకు చాలామంది సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో ఉదయం 6 గంటలకే సూర్యోదయం వేళలో తాజ్ మహల్ అందాలను చూసే అవకాశాన్ని కల్పించారు. దీంతో సూర్యుడి తొలి కిరణాలు తాకుతున్న తాజ్ మహల్ అందాలను చూసి ఆనందించే అవకాశం పర్యాటకులకు లభించనుంది. తాజ్ మహల్ సందర్శన సమయాల్లో ఎప్పుడో మార్పులు చేయాల్సి ఉంది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు కాస్త కరోనా ప్రభావం తగ్గడం, ఢిల్లీలో లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వడంతో సందర్శన వేళల్లో మార్పులు చేశారు.
- Tags
- agra