భారతీయ వంటకాలకు ఆ దేశాధ్యక్షురాలు ఫిదా!

by Shyam |
భారతీయ వంటకాలకు ఆ దేశాధ్యక్షురాలు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్ :

భారతదేశ సంస్కృతినే కాదు… ఇక్కడి వంటకాలను, రుచులను కూడా ఎంతోమంది విదేశీయులు ఇష్టపడుతుంటారు. వారు ఇండియాకు వచ్చినప్పుడు రుచి చూసిన వంటకాలను గుర్తుపెట్టుకుని.. తిరిగి తమ దేశానికి వెళ్లాక, అక్కడ అలాంటి రుచులను అందించే భారతీయ రెస్టారెంట్ల‌కు వెళ్తుంటారు. అందుకే చాలా దేశాల్లో ఇండియన్ రెస్టారెంట్లు అమితమైన ఆదరణ పొందుతున్నాయి. తాజాగా తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్ కూడా భారతీయ వంటకాల టేస్ట్‌ను ఆకాశానికి ఎత్తేసింది. తమ దేశంలోనూ భారతీయ రెస్టారెంట్లు ఉండటం తమ అదృష్టమని కూడా వెల్లడించడం విశేషం.

‘తైవాన్ ప్రజలు చాలా లక్కీ. ఎందుకంటే.. ఇక్కడ అనేక భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. అవంటే.. తైవానీయులకు చాలా ఇష్టం. నాకు మాత్రం ప్రత్యేకంగా చనా మసాలా, నాన్ అంటే చాలా చాలా ప్రీతి. ఇక చాయ్ పరిమళాలు ప్రత్యేకంగా నా భారత పర్యటనల రోజుల్ని గుర్తుకు చేస్తాయి. భారతదేశం వైబ్రంట్, డైవర్స్ అండ్ కలర్‌ఫుల్ కంట్రీ. మీకిష్టమైన భారతీయ వంటకం ఏది?’ అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వెన్, సంప్రదాయ భారతీయ భోజనంతో కూడిన ఓ చిత్రాన్ని ఈ పోస్ట్‌కు జత చేసింది.

ఇక తైవాన్ అధ్యక్షురాలి ప్రశ్నకు చాలా మంది నెటిజన్లు స్పందించారు. వడపావ్, స్వీట్లు, మైసూర్ మసాలా దోశ, బటర్ చికెన్ విత్ నాన్ ఇలా చాలా కామెంట్లు చేశారు. ‘నా ఫేవరెట్ ఒడిషా, పూరి జగన్నాథ్ టెంపుల్ అందించే ప్రసాదం. 56 ప్రసాదాలతో నిండి ఉండే ఈ మహాప్రసాదం 100 శాతం ప్యూర్ వెజ్. మీ అధికారులతో చెప్పి ఈ ప్రసాదాన్ని తినే ప్రయత్నం చేయండి. వీటిని మట్టికుండల్లో, పురాతన సంప్రదాయ పద్ధతుల్లో వండుతారు. కావున.. ఇవి అంత త్వరగా పాడు కావు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed