- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేస్‌బాల్ గేమ్.. ప్రపంచమంతా వీక్షణం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా.. నాలుగేళ్లకోసారి అట్టహాసంగా జరిగే.. ఒలింపిక్స్ ను కూడా వాయిదా వేశారు. యావత్ ప్రపంచ క్రికెట్‌ప్రియులు ఎదురు చూసిన ఐపీఎల్.. నిరవధిక వాయిదా పడింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు పోస్ట్‌పోన్ అయ్యాయి. వింబుల్డన్ టోర్నమెంట్ కూడా కాన్సిల్ అయ్యింది. కరోనా కారణంగా ఇలా అన్ని అంశాలకు చెందిన ఎన్నో క్రీడలు ప్రారంభానికి నోచుకోలేవు. క్రీడా ప్రేమికులంతా పాతమ్యాచ్‌లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీవీల్లో లైవ్ మ్యాచ్ కనిపిస్తే.. గెంతులేయకుండా ఉండగలరా? అదే జరుగుతోంది. తైవాన్ దేశంలోని ఇంటర్నేషనల్ బేస్‌బాల్ స్టేడియంలో బంతుల్ని.. బ్యాట్లు బలంగా బాదుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. రన్స్ కోసం.. పరుగులు పెడుతున్న బ్యాట్సెమెన్లు కనిపిస్తున్నారు. బంతులను ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఫీల్డర్లు, బ్యాట్స్మెన్ ను అవుట్ చేసేందుకు బంతుల విసురుతున్న బౌలర్లు కనిపిస్తున్నారు. అదంతా ఏనాడో టెలికాస్ట్ అయిన మ్యాచ్ దృశ్యాలు కావు. లైవ్ లో వస్తున్న మ్యాచ్ విశేషాలు. వీళ్ల ఆటను మిలియన్ల మంది ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్టేడియంలో కాదు.. టీవీల్లో..
లాక్‌డౌన్‌తోపాటు, కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని క్రీడాపోటీలు క్యాన్సిల్ అయ్యాయి. కానీ తైవాన్ లో రకుటెన్ మంకీస్ వర్సెస్ యుని లయన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ప్రేక్షకులెవరినీ అనుమతించలేదు. ప్రేక్ష్క్షకుల లోటు తెలియకుండా ఉండేందుకు.. కార్డ్ బోర్డుతో చేసిన కటౌట్లను, మన్నెక్విన్స్ ను స్టాండ్స్ లో ఉంచారు నిర్వాహకులు. తైవాన్, జపాన్, సౌత్ కొరియాల్లో బేస్‌బాల్‌కు మంచి ఆదరణ ఉండటంతోపాటు, ఆటగాళ్లను, ప్రేక్షకులను ఉత్సాహపరించేందుకు చీర్ లీడర్స్ డ్యాన్స్ చేస్తుంటారు. ఆ లోటును తీర్చేందుకు నాలుగు రోబోలను ఏర్పాటు చేశారు. అవి డ్రమ్స్ వాయిస్తూ.. స్టెప్పులేస్తే.. చీర్ లీడర్స్ ను తలపించాయి. ‘ద ఓన్లీ లైవ్ # ప్రో-బేస్‌బాల్ గేమ్ ఆన్ ఎర్త్ ’’ అంటూ గేమ్‌కు ముందు ఎలెవెన్ స్పోర్ట్స్ తైవాన్ ట్వీట్ చేసింది. అంతేకాదు తైవాన్ దేశం .. ప్రపంచానికి ఉచితంగా గేమ్స్‌ను బ్రాడ్‌కాస్ట్ చేయడం ఇదే తొలిసారి . ‘డోంట్ ఫీల్ స్యాడ్.. జస్ట్ వాచ్ తైవాన్ ప్రొఫెషనల్ బేస్‌బాల్ ’ అంటూ ఎలెవెన్ స్పోర్ట్స్ జనరల్ మేనేజర్ సైమోన్ ట్వీట్ చేశారు. లైవ్ సందర్భంగా మిలియన్ వ్యూస్ పైన మ్యాచ్ చూశారని ఆయన తెలిపారు. తైవాన్ ప్రెసిడెంట్ తై ఇంగ్ వెన్ కూడా ఈ మ్యాచ్ ను ఇంట్లో కూర్చోని చూడటం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ‘జపాన్, సౌత్ కొరియా, ఇంకెక్కడా గేమ్స్ లేనప్పుడు మా ఆటను చూడటానికి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను’ అనే కామెంట్ ను ఫోటోకు జత చేసింది.
తైవాన్‌లో 24 మిలియన్ల పాపులేషన్ ఉంది. అక్కడ ఇప్పటివరకు కేవలం 395 కరోనా కేసులే నమోదయ్యాయి. అక్కడ కరోనా వైరస్ వల్ల ఆరుగురు మరణించారు. శుక్రవారం అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా కట్టడి కోసం 120 యాక్షన్ టీమ్స్ ను అందుబాటులో ఉంచింది తైవాన్ ప్రభుత్వం. కరోనా నియంత్రణతో తైవాన్ 100 శాతం సక్సెస్ సాధించింది.
tags :coronavirus, lockdown, sports, baseball, taiwan, live, worldwide