- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్తది ముమ్మాటికీ హత్యే ..
దిశ ప్రతినిధి, హైదరాబాద్: తన భర్తది ముమ్మాటికీ హత్యేననీ , ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు విధించేలా చూడాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో కీసర మాజీ తహశీల్ధార్ నాగరాజు భార్య స్వప్న సోమవారం ఫిర్యాదు చేశారు. జైలులో టవల్‌తో కిటికీకి తన భర్త ఉరి వేసుకున్నారని జైలు అధికారులు చెబుతున్నారని ఆమె తెలిపారు. ఇంత చిన్న టవల్‌తో ఉరి ఎలా వేసుకుంటారని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తన భర్త మృతి వెనుక ప్రభుత్వంలోని పెద్దలు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్నారు. ఈ మేరకు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ….. తన భర్త నాగరాజు మృతి వెనుక నలుగురి ప్రమేయం ఉన్నట్లు పక్కా ఆధారాలు కన్పిస్తున్నాయని తెలిపారు. ఇందులో జైలర్ ప్రమేయం కూడా ఉందని ఆమె ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు కరెక్టుగా జరిపించాలన్నారు. తన భర్త మరణంపై డబీర్ పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు తనను సీఐ కూర్చోబెట్టారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో సీఐ మాట్లాడారని ఆమె తెలిపారు. ఆ తర్వాత మీ మంచి కోసం చెబుతున్నాను , మీకు పిల్లలు ఉన్నారు , ఎవిడెన్స్ ఉండాలి , లేకపోతే ఏమీ చేయలేమని తనతో సీఐ అన్నారని ఆమె వెల్లడించారు. వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. తన భర్తది ముమ్మాటికి హత్యే ననీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తన భర్తను చంపిన వారితో తనకు, తన పిల్లలకు హాని ఉందని స్వప్న తెలిపారు.