స్క్రీన్‌పై ఉమన్ లస్ట్.. దైవదూషణ కాదు: టబు

by Shyam |
స్క్రీన్‌పై ఉమన్ లస్ట్.. దైవదూషణ కాదు: టబు
X

దిశ, వెబ్‌డెస్క్: టబు..హీరోయిన్‌గా గ్లామర్ టచ్ ఇచ్చిన భామ..ప్రజెంట్ బోల్డ్ క్యారెక్టర్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. బాలీవుడ్ పిక్చర్ ‘అందాధున్‌’లో బోల్డ్ అండ్ చాలెంజింగ్‌ క్యారెక్టర్ చేసిన టబు.. ఆ క్యారెక్టర్‌కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ చిత్రం ఏ భాషలో రీమేక్ అయినా సరే టబు పాత్ర ఎవరు చేస్తున్నారు? అనే చర్చ జరుగుతుంది. అంత క్లిష్టమైన పాత్రను అవలీలగా చేసి… తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను అంతగా ఇంపాక్ట్ చేయగలిగింది. ‘జవానీ జానెమన్’ ‘ఏ సూటబుల్ బాయ్’లో అసాధారణ పాత్రల్లో కనిపించి భేష్ అనిపించింది.

ఈ క్రమంలో భిన్నమైన పాత్రలు, సంక్లిష్ట సంబంధాలను తెరపై ఆవిష్కరించడం గురించి చర్చించింది. లవ్, లస్ట్, మనుషుల మధ్య ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ గురించి తెరపై ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నించింది. ఉమన్ లస్ట్, అధికారం కోసం మహిళ దురాశ గురించి చూపించడంలో తప్పులేదని..దాన్ని దైవదూషణగా భావించాల్సిన పనిలేదని అభిప్రాయపడింది. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూపించడంలో తప్పులేదు కదా అన్న యాక్ట్రెస్.. నైతిక విలువలతో కూడిన పాత్రలను స్క్రీన్‌పై చూపించడం మంచిదే కానీ..అసాధారణ సంబంధాల్లో ఉన్న తీవ్రభావోద్వేగాలను ఎందుకు చూపించలేకపోతున్నాం అంది. అలాంటి పాత్రలపై లోతుగా పరిశోధన చేయడం తనకు ఆసక్తికరంగా, సంతృప్తిగా ఉంటుందని తెలిపింది. అలాంటి పాత్రల్లో తెరపై కనిపించేందుకు సిగ్గుపడనని స్పష్టం చేసింది. అయినా అలాంటి పాత్రలను తెరపై చూసి డైజెస్ట్ చేసుకోకపోవడానికి ఏముంది? అందరికి తెలిసిన విషయాలే కదా అంటోంది టబు.

Advertisement

Next Story