థప్పడ్ : తాప్సీ యాక్టింగ్‌కు బాలీవుడ్ ఫిదా

by Shyam |
థప్పడ్ : తాప్సీ యాక్టింగ్‌కు బాలీవుడ్ ఫిదా
X

తాప్సీ… బాలీవుడ్‌లో పాగా వేసింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. ‘థప్పడ్’ సినిమాతో మరో హిట్ అందుకుంది. ‘ముల్క్’, ‘ఆర్టికల్ 13’ సినిమాలు అందించిన డైరెక్టర్ అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు. భార్యాభర్తల బంధంలో కోపతాపాలు కామన్. కానీ పది మంది ముందు భర్త భార్యను చెంపదెబ్బ కొడితే.. ఆ మహిళ ఎంతగా లోలోపల రగిలిపోతుందనే లైన్‌ను తీసుకుని నేటి సమాజానికి అర్ధమయ్యేలా సినిమా తీశాడు అనుభవ్ సిన్హా. సినిమాలో మెయిన్ రోల్ చేసిన తాప్సీ… తన పాత్రకు జీవం పోయగా.. బాలీవుడ్ ప్రముఖులు తాప్సీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ‘థప్పడ్’ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘థప్పడ్’ .. చాలా సున్నితమైన, సమాజానికి అవసరమైన సినిమా అన్నారు. బెస్ట్ మెస్సేజ్‌ ఇస్తూ చాలా చక్కగా, అందరికీ అర్ధమయ్యేలా తీసిన సినిమా అని… చిత్ర దర్శకులు, రచయిత, నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘థప్పడ్‌’ను ఇండియన్ సినీ హిస్టరీలో మైల్ స్టోన్‌గా అభివర్ణించారు.

జావెద్ అక్తర్ పోస్ట్‌తో షాక్ అయింది తాప్సీ. నాకు ఈ మూమెంట్‌లో మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేసింది. జావెద్ అక్తర్ నుంచి ఇంత గొప్ప కాంప్లిమెంట్ అందాక ఆనందంతో మూగబోయానని తెలిపింది. డైరెక్టర్ అనుభవ్ సిన్హా సైతం జావెద్ పోస్ట్‌తో ఆనందం వ్యక్తం చేశారు. ఈ మాటలు విన్నాక సినిమాల్లో నుంచి రిటైర్ అయిపోయినా పర్వాలేదు అనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు.



Next Story