- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా డేవిడ్ వార్నర్
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్‌లో 7 మ్యాచ్‌లలో 48.16 సగటు, 146.70 సగటుతో వార్నర్ మొత్తం 289 పరుగులు సాధించాడు. అయితే వార్నర్ చివరి 4 మ్యాచ్‌లలో ఏకంగా 151.44 సగటుతో 209 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా ఎంపికయ్యాడు. నవంబర్ నెలకు సంబంధించి పురుష క్రికెటర్లలో పాకిస్తాన్‌కు చెందిన అబిద్ అలీ, న్యూజీలాండ్ పేసర్ టిమ్ సౌథీలతో పాటు వార్నర్ నామినేట్ అయ్యాడు. అయితే అత్యధిక వోట్లు వచ్చిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. ఇక మహిళల క్రికెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన అనమ్ అమిన్, బంగ్లాదేశ్ క్రికెటర్ నహీదా అక్తర్, వెస్టిండీస్‌కు చెందిన హేలే మాథ్యూస్ నామినేట్ అయ్యారు. అయితే తన ఆల్‌రౌండ్ టాలెంట్‌తో మంచి ప్రతిభ కనపరిచిన మాథ్యూస్‌ను ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యింది.