ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు : టీ పోపా

by Shyam |
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు : టీ పోపా
X

దిశ, న్యూస్ బ్యూరో: ఏ సమస్యకూ చావు, బలవన్మరణం పరిష్కారం కాదు, కారాదు. ఆత్మహత్య పిరికి చర్యని, అవివేకంతో ఆందోళనతో సమస్యల నుంచి పారిపోయేందుకు చేసే ప్రయత్నమని తెలంగాణ పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పోపా) అభిప్రాయపడింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న నేత కార్మికుల ఆత్మహత్యలు తీవ్రంగా కలచివేస్తున్నాయని అసోసియేషన్ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సామల సహదేవ్, సహాధ్యక్షులు శిరందాస్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేద పద్మశాలి విద్యార్థులను టీ పోపా విద్యాజ్యోతితో ఆదుకోవాలని భావిస్తున్న తరుణంలో నేత కార్మిక కుటుంబాల్లో ఇంటి పెద్ద దిక్కు బలవన్మరణం, ఇంటి దీపం ఆర్పడమే అవుతుందన్నారు.

ప్రభుత్వమే కార్మికుడికి ముడి సరుకులు, రంగులు అందించాలి. చేనేత క్లస్టర్ లని ఏర్పాటు చేసి వారికి స్కిల్ డెవలప్మెంట్ తరగతులను నిర్వహించాలన్నారు. వారి సృజనాత్మతకు పదును పెట్టాలని కోరారు. ఉత్పత్తి వేగాన్ని పెంచి, శ్రమ వినియోగాన్ని తగ్గించాలన్నారు. నేసిన వస్త్రాలను కొనుగోలు కాకపోతే మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని ఆ సంఘం కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు ఆస్పత్రుల్లో చేనేత ఉత్పత్తులను వాడాలన్నారు. జిల్లా, రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలల్లో చేనేత ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఉచిత సదుపాయం కల్పించడమే కాకుండా సబ్సిడీలు ఇవ్వాలన్నారు.ఇక నుంచి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో మార్కెటింగ్ సదుపాయాన్ని, చేనేత బజారులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్యం చేనేత వృత్తిని మెరుగు పరచడానికి తగిన శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. టెక్స్ టైల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేనేత కార్మికుల పిల్లలకు 50శాతం సీట్లు కేటాయించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed