- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేద పద్మశాలి విద్యార్థులకు ‘టీ పోపా’ చేయూత
దిశ, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద పద్మశాలి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఆలంబన అందించేందుకు టీ పోపా విద్యాజ్యోతికి అంకురార్పణ చేసినట్లు తెలంగాణా పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గండూరి వేంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నాంపల్లిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తగినంత ప్రజ్ఞా పాటవాలు ఉండి, స్థోమత లేక చదువుకు దూరం అవుతున్న విద్యార్థుల జీవితాల్లో (టీ పోపా విద్యాజ్యోతి) వెలుగును నింపుతుందన్నారు. సహాధ్యక్షులు సిరాందాస్ శ్రీనివాసులు మాట్లాడుతూ..వీలైనంత త్వరగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా నిష్ణాతులైన నిపుణులతో ఓ గవర్నింగ్ బాడీ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.టీ పోపా ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ..ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ ద్వారా ఏయే విద్యా ఉద్యోగ అవకాశాలుంటాయి. గ్రూప్స్, సివిల్స్ సాధనకు అవసరమయ్యే గైడెన్స్‌పై విద్యా జ్యోతి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని వివరించారు. కార్యక్రమంలో టీ పోపా మహిళా అధ్యక్షురాలు ఎస్ రేవతి పాల్గొన్నారు.