ఇక గడ్డం తీసేస్తా : నటరాజన్

by Shyam |
ఇక గడ్డం తీసేస్తా : నటరాజన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన తమిళనాడు ఆటగాడు టి. నటరాజన్ చాలా సంతోషంగా ఉన్నాడు. యార్కర్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న నట్టూ.. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా భారత జట్టుకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎన్నికయ్యాడు. అయితే టీ20కి తొలి సారిగా ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరంకావడంతో ఆ అదృష్టం కాస్తా నటరాజన్‌ను వరించింది.

బెంగళూరుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే నటరాజన్ భార్య పవిత్ర ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ మ్యాచ్‌లో నటరాజన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాతే అతను టీమ్ ఇండియాకు కూడా ఎంపికై ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. ఈ సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ.. తనకు బిడ్డ పుట్టడం అదృష్టంగా మారిందన్నాడు. తాను ఇంత వరకు తన కూతురి ఫొటో కూడా చూడలేదని.. వీడియో కాల్‌లో మాత్రమే చూశానని అన్నాడు. ఇకపై తాను గడ్డం తీసేస్తానని.. ఈ ఏడాది అందరికీ భారంగానే గడిచింది. కానీ ఏడాది చివరిలో తనకు మాత్రం అన్నీ శుభాలే జరుగుతున్నాయని నట్టూ వివరించాడు.

Advertisement

Next Story