- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. ప్రధాని రాజీనామా
by vinod kumar |
X
న్యూఢిల్లీ: స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో గతవారం ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన ప్రభుత్వం గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి ఆయనకు వారం రోజుల గడువును ఇచ్చింది. కాగా సోమవారంతో గడువు ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని పదవికి తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. ఆ పదవీ బాధ్యతల నుంచి ఉపశమనం కలిగించాలనీ స్పీకర్‌ను కోరినట్టు వెల్లడించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం స్వీడన్‌కు మంచిది కాదని ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు కూడా ఏడాది దూరంలో ఉన్నాయనీ ఆయన గుర్తు చేశారు.
Advertisement
- Tags
- resign
Next Story