‘కరీనా కొడుకు పేరుపై ట్రోల్స్ చేసేవారు గాడిదలే’

by Shyam |   ( Updated:2021-08-12 05:07:25.0  )
‘కరీనా కొడుకు పేరుపై ట్రోల్స్ చేసేవారు గాడిదలే’
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్.. కరీనా కపూర్ – సైఫ్ అలీఖాన్ దంపతులపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. కరీనా మొదటి కొడుకు తైమూర్ పేరు విషయంలో ఆల్రెడీ కాంట్రవర్సీ ఎదుర్కోగా ఇప్పుడు రెండో కొడుకు పేరు కూడా వివాదాస్పదమైంది. మొఘల్ చక్రవర్తి ‘జహంగీర్’ పేరును ఎంచుకున్నారన్న వార్తతో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన స్వరా.. ‘తమ వారసుడికి పేరు పెట్టుకునే స్వతంత్రం దంపతులకు ఉంటుంది. ఆ దంపతులు మీరు కాదు. అయినా సరే.. ఏ పేరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అనే ఇష్యూ మీ మెదడులో తిరుగుతుంది. అది మీ ఫీలింగ్స్‌ను హర్ట్ చేస్తుంది. అంటే మీరు ప్రపంచంలోనే పెద్ద గాడిద’ అని ట్వీట్ చేసింది. కాగా.. కరణ్ జోహార్‌తో లైవ్ చాట్ సెషన్‌‌లో పాల్గొన్న కరీనా, తన కొడుకు పేరు ‘జె అలీ ఖాన్’ అని తెలిపింది.

Advertisement

Next Story