ఇక యాడ్స్ లేకుండా హెచ్‌డీ ప్రసారాలు

by Anukaran |   ( Updated:2020-09-28 08:37:04.0  )
ఇక యాడ్స్ లేకుండా హెచ్‌డీ ప్రసారాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఇక నుంచి వెంకటేశ్వర భక్తి ఛానల్​ యాడ్స్ ​లేకుండా ప్రసారాలు అందిస్తుందని టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని అలిపిరిలో ఎస్వీబీసీ కోసం నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించి మాట్లాడారు. రెండు స్టూడియోలు, టెలి పోర్టులు కొత్తగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాడ్​ ఫ్రీ చేస్తున్నందున భక్తుల నుంచి విరాళాలు కోరుతున్నామని, ఇప్పటికే రూ.4కోట్లు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్వీబీసీని పూర్తి హెచ్‌డీ ఛానల్‌గా మార్చుతున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story