- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

దిశ ,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల కేంద్రంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన.. అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసం మతసామారాస్యానికి ప్రతికగా నిలుస్తుందన్నారు. ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు పాషా సెట్, మల్లికార్జున అప్ప, విట్టల్ రెడ్డి, అజీమ్ లాలా, దర్పల్ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.