- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసిన డ్రెస్సే వేసే.. సెలెబ్రిటీ ఫ్యాషన్ చేసె!
ఫిబ్రవరి అంటే అవార్డుల సీజన్… రెడ్ కార్పెట్ హొయలు.. బాఫ్టా, ఆస్కార్, వానిటీ ఫెయిర్ ఇలా లెక్కలేనన్ని వేడుకలకు సెలెబ్రిటీలు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రపంచంలోని కెమెరాలన్నీ వాళ్లను చూస్తాయని తెలిసినపుడు అందుకు తగ్గట్లుగా వస్త్రాలంకరణ ఉండాలని సెలెబ్రిటీలు అనుకుంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. సస్టైనబుల్ ఫ్యాషన్ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఈ ట్రెండ్‌లో ఒక్కో వేడుకకు ఒక్కో డ్రెస్ కాకుండా వేసుకున్న దుస్తులనే మళ్లీ వేసుకోవడం, లేదంటే సస్టైనబుల్ మెటీరియల్‌తో చేసిన దుస్తులు ధరించడం కొత్త ఫ్యాషన్.
ఈ ఏడాది ప్రారంభంలో బాఫ్టా వారు తమ వేడుకకు హాజరయ్యే సెలెబ్రిటీలను సస్టైనబుల్ దుస్తులు ధరించి రావాలని కోరింది. కానీ, పెద్దగా ఎవరూ పాటించినట్లు కనిపించలేదు. కానీ 92వ ఆస్కార్ వేడుకల్లో, తర్వాతి వానిటీ ఫెయిర్ పార్టీలో పెద్ద పెద్ద తారలు తమ పాత డ్రెస్‌లకు కొత్త జీవం పోసి ధరించి హాజరయ్యారు.
వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన జాక్వీన్ ఫీనిక్స్ గురించి. 2020లో జరిగిన అన్ని అవార్డు వేడుకలకు ఆయన స్టెల్లా మెక్‌కార్టినీ టక్సీడో ధరించి హాజరై సస్టైనబుల్ ఫ్యాషన్ గురించి తన వంతు అవగాహన కలిగేలా చేశారు. ఇంకా ఈ జాబితాలో కేట్ మిడెల్టన్, లీ సెడాక్స్, కెట్లీన్ డెవర్, కిమ్ కర్దాషియన్, ఒలివియా కోల్మన్, పెనెలోప్ క్రూజ్, లారా డెర్న్, ఎలిజబెత్ బ్యాంక్స్ ఉన్నారు. ఇక నటి సెర్షా రోనన్ మాత్రం తన బాఫ్టా డ్రెస్ కుట్టించుకోగా మిగిలిన వస్త్రాన్ని ఆస్కార్ వానిటీ ఫెయిర్ కోసం ధరించిన వస్త్రం కుట్టడంలో వాడేసి తనదైన శైలిలో సస్టైనబుల్ ఫ్యాషన్ గురించి చాటి చెప్పారు.