ఇంటి నుంచి వెళ్లిన యువతి.. బావిలో అలా.. అది ప్రియుడిపనేనా ?

by Aamani |   ( Updated:2021-09-22 00:46:16.0  )
ఇంటి నుంచి వెళ్లిన యువతి.. బావిలో అలా.. అది ప్రియుడిపనేనా ?
X

దిశ, భీమారం: యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన భీమారం మండలంలోని అరెపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం .. అరెపల్లి గ్రామానికి చెందిన ఎన్ రవళి రెడ్డి ( 20 ) మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన రవళి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు వెతికారు. చివరికి ఓ వ్యవసాయ బావిలో రవళి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతురాలి తండ్రి, గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శేఖర్‌పై అనుమానాలు ఎన్నో..

మృతురాలు రవళి‌ అదే గ్రామానికి చెందిన దుర్గం శేఖర్‌ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారికి తరుచు గొడవలు అవుతుండటం‌తో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిపోదామని నిర్ణయం చేసుకోగా అప్పటి నుంచి ఇంట్లో కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే ప్రియుడే చంపి బావిలో వేశారని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story