హైదరాబాద్‌లో మరో దారుణం.. 13 నెలల చిన్నారిని అలా చేసి ఇంటిముందు వేశారు

by Anukaran |   ( Updated:2021-09-13 04:51:13.0  )
హైదరాబాద్‌లో మరో దారుణం.. 13 నెలల చిన్నారిని అలా చేసి ఇంటిముందు వేశారు
X

దిశ, శేరిలింగంపల్లి : తెలుగు రాష్ట్రాల్లో మానవ మృగాలు తమ పంజా విసురుతూనే ఉన్నారు. అనునిత్యం ఎక్కడో ఓచోట బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని సైదాబాద్ ఘటన మరువక ముందే మియాపూర్‌లో అభం శుభం తెలియని చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మియాపూర్‌లోని ఓంకార్ నగర్‌లో ఉండే 13నెలల బాలిక ఆదివారం సాయంత్రం అదృశ్యమై సోమవారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించింది. ఇంటి సమీపంలోని నీటి తొట్టిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక కళ్లు పొడిచి ఉన్నట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

చిన్నారి మృతిపై అనేక అనుమానాలు

మియాపూర్ ఓంకార్ నగర్‌లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులు రోజు లాగానే చెత్త ఏరడానికి వెళుతూ.. పాపను పక్కింట్లో వదిలి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి పాప కనిపించకపోవడంతో పక్కింటి వారిని అడిగారు. తమకు తెలియదని చెప్పడంతో చుట్టుపక్కలంతా వెతికారు అయినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉండే 13 ఏళ్ల బాలుడు ఎత్తుకెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ చిన్నారి ఇంటికి వచ్చిన అమ్మమ్మ తీరు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు పాప అమ్మమ్మను కూడా విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం చిన్నారి అత్యాచారానికి గురైందా, లేదా ఎలా మరణించింది అనే విషయంపై స్పష్టత వస్తుందని అంటున్నారు పోలీసులు. పాపను తీసుకు వెళ్లిన బాలుడు ఎవరు, అతను ఎక్కడికి తీసుకు వెళ్ళాడు. పాప రెండు కళ్ళను పొడిచింది ఎవరు.. అనే విషయంపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పాప తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం కూడా పలు అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు వారిని సైతం విచారిస్తున్నారు.

Advertisement

Next Story