కాంగ్రెస్‌లో అంతర్మథనం.. అభ్యర్థిపై వీడని ఉత్కంఠ

by Sridhar Babu |   ( Updated:2021-10-01 00:57:26.0  )
huzurabad-revanth
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ పలు కోణాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అభ్యర్థిని ముందుగానే డిక్లేర్ చేస్తే ప్రత్యర్థి పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందన్న విషయంపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. బలమైన అభ్యర్థితో పాటు ప్రత్యర్థి పార్టీలకు తలొగ్గని వారిని ఎంపిక చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అభ్యర్థిని ప్రకటించినట్టయితే ప్రత్యర్థి పార్టీలు ఒత్తిళ్లకు గురి చేసి తమకు అనుకూలంగా మల్చుకుంటే అసలుకే మోసం వస్తుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అభ్యర్థి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story