అనుమానాస్పద వ్యక్తి అరెస్టు..

by Shyam |
అనుమానాస్పద వ్యక్తి అరెస్టు..
X

దిశ, మల్కాజిగిరి :
మల్కాజిగిరి నియోజకవర్గంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్‌లో గురువారం చోటుచేసుకుంది. వెంటనే ఘటనా స్థలికి చేరకున్న అల్వాల్ పోలీసులు అనుమానిత వ్యక్తిని విడిపించి,స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.

ఆ వ్యక్తికి మతిస్థిమితం లేక ఇలా చేశాడా.. లేక దొంగతనానికి యత్నించడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఆ వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Next Story