- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫస్ట్ లవ్’ ఎవరో చెప్పేసిన సుస్మితా సేన్
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ సుస్మితా సేన్.. కూతురు రెనీ సేన్ బర్త్‌డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసింది. అంతేకాదు రెనీని ఫస్ట్ లవ్‌గా పేర్కొంటూ, తనకు తల్లిని కావడం దేవుడి ఆశీర్వాదమని తెలిపింది. రెనీ 22వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా షేర్ చేసిన పిక్స్‌కు ‘ఫేస్ ఆఫ్ లవ్, హ్యాపీ బర్త్‌డే మై ఫస్ట్ లవ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో రెడ్ కలర్ డ్రెస్ ధరించిన రెనీ సేన్.. లూజ్ హెయిర్, నేచురల్ లుక్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. అయితే సుస్మితకు ‘రెనీ, అలీషా’ ఇద్దరు కూతుర్లు ఉండగా.. రెనీని 2000లో, అలీషాను 2010లో అడాప్ట్ చేసుకుంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే రెనీ ‘సుత్తాబాజి’ షార్ట్ ఫిల్మ్‌లో డెబ్యూ ఆర్టిస్టుగా పరిచయమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, రెనీకి 16 ఏళ్ల వయసున్నపుడు తన బయోలాజికల్ పేరెంట్స్ ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చిందని సుస్మిత గత ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక ఎన్వలప్ కవరులో ఆ సమాచారం ఉందని, అయితే దాన్ని రెనీకి 18 ఏళ్లు నిండాగానే ఇస్తానని చెప్పింది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ తప్పయితే తను తట్టుకోలేదని, అందుకు సిద్ధంగా ఉన్నప్పుడే తీసుకెళ్తానని రెనీకి చెప్పినట్టు రివీల్ చేసింది.