- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్‌పై సినిమాలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో తండ్రి
దిశ, సినిమా : లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితకథ ఆధారంగా ‘న్యాయ్ : ది జస్టిస్, సూడైడ్ or మర్డర్ : ఏ స్టార్ వాజ్ లాస్ట్, శశాంక్’ చిత్రాలు అనౌన్స్ చేశారు బాలీవుడ్ మేకర్స్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ చిత్రీకరణ దశలో ఉండగా, సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుశాంత్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలను బ్యాన్ చేయాలని కోరారు. తనకు సంబంధించిన స్టోరీతో ఎలాంటి ఫిల్మ్, పబ్లికేషన్ రాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రాజ్‌పుత్ వ్యక్తిగత జీవితాన్ని వర్ణించే ఏ సినిమా అయినా ప్రస్తుతం నడుస్తున్న కేసుల్లో సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉందని, ప్రజలకు సుశాంత్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చే చాన్స్ ఉందని చెప్పారు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు సుశాంత్ మరణాన్ని ఉపయోగించుకుని డిఫరెంట్ స్టోరీస్, థియరీస్ ప్లాన్ చేసి ఫేమ్ పొందేందుకు ట్రై చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా దెబ్బతినే చాన్స్ ఉందన్న కృష్ణ కిశోర్ సింగ్.. ఇప్పటి వరకు ఏ ఫిల్మ్ మేకర్ కూడా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించేందుకు తమ దగ్గర లీగల్‌గా అనుమతి పొందలేదని స్పష్టం చేశారు. దేశంలోని న్యాయస్థానాలు మేధో సంపత్తి హక్కుతో సమానంగా ప్రముఖుల హక్కులను గౌరవించాలని, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్, ఫేమ్‌ను వాణిజ్య లాభాల కోసం దుర్వినియోగం చేయడం సబబు కాదని తెలిపారు. తమకు తెలియకుండా సుశాంత్ పేరు, ఇమేజ్, లైఫ్‌స్టైల్ వినియోగిస్తే వ్యక్తిత్వ హక్కును ఉల్లంఘించడం అవుతుందని, కాపీరైట్ కిందకు వస్తుందని తెలిపారు.