సుశాంత్ మరణంపై ఎయిమ్స్ ప్రకటన

by Shyam |
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై కీలక ప్రకటన చేసింది ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్. సుశాంత్ ఆత్యహత్య చేసుకునే చనిపోయాడని స్పష్టం చేసింది. ఫైనల్ రిపోర్ట్‌ను సీబీఐకి సమర్పించింది. సుశాంత్ కుటుంబం ఆరోపిస్తున్నట్లుగా ఎవరూ తనను హత్య చేయలేదని.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టం చేసింది. తనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని.. ఎవరూ గొంతు పిసికి చంపలేదని.. విష ప్రయోగం జరగలేదని వెల్లడించింది.

ఈ ప్రకటనపై స్పందించిన నిందితురాలు రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనీష్ పాండే.. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు. నిజం ఎప్పటికీ మారదని.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే చనిపోయాడని అన్నారు.

Advertisement

Next Story