బెంగాలీ టెక్ట్స్ బుక్‌లో సుశాంత్ సింగ్..

by Shyam |
Sushant Singh, Ankita Lokhande
X

దిశ, సినిమా: లేట్ బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్, నటి అంఖితా లోఖండే తమ కెరీర్ స్టార్టింగ్‌లో ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్‌లో కపుల్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఆ తర్వాత విడిపోయారు. తాజాగా వీరిద్దరూ కలిసిఉన్న ఫొటో ఒకటి బెంగాలీ టెక్ట్స్ బుక్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇది పవిత్ర రిష్తా సీరియల్‌లోని పిక్చర్ కాగా, దీనిపై పేరెంట్‌హుడ్, ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్ కూడా ఈ బుక్‌లో పొందుపరిచారు. ట్విట్టర్ యూజర్ ఒకరు ఈ ఇమేజ్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ‘ఒక ఫ్యామిలీలోని ఫాదర్ ఫిగర్‌ను గుర్తించేందుకు బెంగాలీ టెక్ట్స్ బుక్‌.. మాకు ఇష్టమైన SSR ఫొటోను ప్రచురించింది. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీని ద్వారా ‘సుశాంత్ ది బెస్ట్’ అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా భావిస్తున్న విషయం అర్థమవుతోంది’ అనే మెసేజ్ జతచేసింది.

ఇక తమ అభిమాన హీరో ఫొటోను ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పే క్రమంలో పాఠ్య పుస్తకంలో వాడటం పట్ల సుశాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత నెలలో ఆస్కార్ వెబ్‌సైట్‌లోని మెమోరియన్ గ్యాలరీలో సుశాంత్ పేరును స్పెషల్‌గా మెన్షన్ చేశారు. ‘ప్రొఫెషన్ : యాక్టర్’ అనే నోట్‌తో అతని చిత్రాన్ని డిస్‌ప్లే చేశారు.

Advertisement

Next Story