ఒక్క పని కూడా పూర్తి కాలేదు.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

by Shyam |
Suryapet Collector T. Vinay Krishnareddy
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మహమ్మాదాపురం గ్రామంలో బుధవారం కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ, స్వర్గధామం, సరిగ్రేషన్ పనులను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 18 నెలల నుండి స్మశాన వాటిక పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు, స్థానిక సర్పంచ్‌ని ప్రశ్నించారు. సిగిగ్రేషన్ షెడ్ వద్ద బాత్రూమ్ నిర్మించి డోర్ అమర్చకుండా అసంపూర్తిగా వదిలేయడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులను జులై ఆరు, ఏడు తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోతే ఎలా అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే అధికారులపై స్థానిక సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా.. పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌యాడ్‌లను పరిశీలించి వన నర్సరీలో మొక్కల పెంపకం సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటాచారి, ఎంపీవో ఆంజనేయులు, సర్పంచ్ కొండేటి రజని సుధాకర్, ఏపీవో రవి, ఉపసర్పంచ్ గుండు వెంకన్న ఇంచార్జ్ పంచాయితీ కార్యదర్శి శివ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed