- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలో కరోనారహిత జిల్లాగా సూర్యాపేట: జగదీశ్ రెడ్డి
by Shyam |
X
దిశ, నల్గొండ: సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. త్వరలోనే కరోనా రహిత జిల్లాగా సూర్యాపేట నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెల్లరేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్న 600 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను గురువారం మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో అపోహలు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Tags: minister jaghadish reddy, comments, corona-free, suryapet
Advertisement
Next Story