- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీపై సూర్యకుమార్ ట్వీట్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసినా ఒక వివాదం మాత్రం సమసిపోవడం లేదు. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మాన్ సూర్యకుమార్ యాదవ్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఒక మ్యాచ్‌లో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతున్నది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తీక్షణంగా కోహ్లీ వైపు చూడటం.. కోహ్లీ అతడి వైపు దూసుకొని వెళ్లడం తెలిసిందే. ఆ తర్వాత ఒక మ్యాచ్‌లో సూర్యకుమార్ ‘నేనున్నాను’ అంటూ సైగలు చేయడంతో కోహ్లీ అభిమానులు సూర్యను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఆసీస్ పర్యటనకు సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడం వెనుక కోహ్లీ ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి. కోహ్లీ, రోహిత్‌ల గొడవ మధ్యలో సూర్య అనవసరంగా దూరాడంటూ కామెంట్లు కూడా చేశారు. ఇటీవల కోహ్లీకి వ్యతిరేకంగా చేసిన మీమ్‌కు సూర్య లైక్ కొట్టడం.. దీనిపై విమర్శలు రావడంతో ఆ లైక్ తొలగించడం జరిగింది. దీంతో కోహ్లీకి తనకు దూరం పెరుగుతున్నదని గ్రహించిన సూర్య.. తాజాగా కోహ్లీని పొగుడుతూ ట్వీట్ పెట్టాడు. కోహ్లీ షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ..’ఆస్ట్రేలియాలో మీ ఆధిపత్యాన్ని చూడటానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను’ అని కామెంట్ చేశాడు. అలా ఈ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు.