క‌రోనా రోగుల‌పై నిఘా.. ఉల్లంఘిస్తే స‌ర్వ‌ర్ ద్వారా హెచ్చ‌రిక‌లు

by Shyam |
క‌రోనా రోగుల‌పై నిఘా.. ఉల్లంఘిస్తే స‌ర్వ‌ర్ ద్వారా హెచ్చ‌రిక‌లు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. దీంతో క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి బారినప‌డినవారి పర్యవేక్షణ కోసం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా పంజా విసురుతోన్న స‌మ‌యంలో.. ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన మందేలేని ఆ వైర‌స్ క‌ట్ట‌డికి ర‌క‌ర‌కాల ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తోంది . అయితే, రోజురోజుకూ క‌రోనా కేసులు పెర‌గ‌డం.. క్వారంటైన్‌, ఐసోలేష‌న్‌లో ఉండే క‌రోనా బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతుండ‌డంతో.. వారి ప‌ర్య‌వేక్ష‌ణ ప్ర‌భుత్వానికి స‌వాల్‌గా మారింది. దీంతో.. డీఆర్డీవోతో తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) కీల‌క ఒప్పుందం కుదుర్చుకుంది.. హోం క్వారంటైన్ లేదా హోం ఐసోలేష‌న్‌లో ఉన్న క‌రోనా బాధితుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, జియోఫెన్సింగ్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే స‌ర్వ‌ర్ ద్వారా హెచ్చ‌రిక‌లు పేలా ఉండేందుకు ఓ యాప్‌కు శ్రీ‌కారం చుట్టారు.. ఆ యాప్ నిర్వ‌హ‌ణ భాగ‌స్వామిగా టీటా ఉంటుంది.

హోం క్వారంటైన్‌, హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారితో పాటు.. క‌రోనా రోగుల విష‌యంలో ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ రూపొందించి.. వారి కదలికలను ప‌ర్యవేక్షిస్తారు. స్మార్ట్ ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పేషెంట్స్ రిస్క్స్ (సంప‌ర్క్) పేరుతో డీఆర్డీవో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా క్వారంటైన్ లేదా ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారిని ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.. ఈ సాఫ్ట్‌వేర్ అమ‌లు కోసం రెండు సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకోగా.. త్వ‌ర‌లో రాష్ట్రంలోని ఏదైనా ఓ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేయ‌నున్నారు.. ఆ ప్ర‌యోగం విజ‌య‌వంతం అయితే.. రాష్ట్రవ్యాప్తంగా అమ‌లుచేసే అవ‌కాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed