చెర్రీ, తారక్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సర్‌ప్రైజెస్..?

by Jakkula Samataha |
చెర్రీ, తారక్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సర్‌ప్రైజెస్..?
X

దిశ, సినిమా : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రంలో చరణ్, తారక్‌లు అల్లూరి, కొమురం భీమ్‌గా కనిపించనుండగా.. బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా వీరికి జోడీగా నటిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఆలియా భట్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ విడుదల చేసిన ‘సీత’ లుక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా మరో వారం రోజుల్లో (మార్చి 27న) చరణ్ బర్త్‌డే ఉండగా, అప్పుడు ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో? అని మెగా ఫ్యాన్స్ జక్కన్న వైపు చూస్తున్నారు.

గతేడాది చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా తారక్ వాయిస్‌ ఓవర్‌తో సీతారామరాజు టీజర్ రివీల్ చేయగా, ఈ సారి కూడా జక్కన్న మరో సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తారక్ పుట్టినరోజు(మే 20)న కూడా స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని సమాచారం. అయితే ఈ విషయమై మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Advertisement

Next Story