‘ఆకాశమే నీ హద్దురా!’ బ్లాక్ బస్టర్ లోడింగ్..

by Jakkula Samataha |
‘ఆకాశమే నీ హద్దురా!’ బ్లాక్ బస్టర్ లోడింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : చంద్రమహేశ్ కనయనమ్.. ఒక్క రూపాయికే ప్రజలను ఫ్లైట్ ఎక్కించే అతడి ప్రయత్నం, ఫ్లైట్ కంపెనీ ప్రారంభించేందుకు పడే తపన, వ్యవసాయం చేసేవాడిని విమానం ఎక్కించాలన్న తన కోరిక నెరవేరుతాయా? అనేది ఆకాశమే నీ హద్దురా! సినిమా కథ. సూపర్‌స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఏరోప్లేన్ కొనుగోలు చేసేందుకు అప్పు అడిగిన మొదటి వ్యక్తి అయిన చంద్రమహేశ్.. 24 బ్యాంక్‌లు రిజెక్ట్ చేసినా తన కలను ఎలా సాకారం చేసుకున్నాడు? తను ఉండే గల్లీ నుంచి ఢిల్లీ వరకు శత్రువులున్నా.. ప్లేన్ లాండ్ అవడానికి వీల్లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా, సొంతంగా ఫ్లైట్ కొని ప్రజలను ఎక్కించిన చంద్ర మహేశ్.. ప్లేన్‌ను ఎలా లాండ్ చేశాడు? అందరికిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

ట్రైలర్‌లో ఎప్పటిలాగే సూర్య లుక్, పర్ఫార్మెన్స్ అదిరిపోగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెంటార్‌గా కనిపించబోతున్న సినిమా నవంబర్ 12న టేకాఫ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కానున్న సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ సూపర్ ప్రామిసింగ్‌గా ఉండటంతో.. ఓటీటీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

కాగా సుధ కొంగర డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను 2డీ ఎంటర్‌టైన్మెంట్స్, సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అపర్ణ బాలమురళి హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ కాగా, సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Advertisement

Next Story