మరోసారి తండ్రి, కొడుకుగా సూర్య

by Shyam |
మరోసారి తండ్రి, కొడుకుగా సూర్య
X

హీరో సూర్య అటు తమిళ్, ఇటు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో సూర్య ఏ సినిమా చేసినా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తప్పకుండా రిలీజ్ చేస్తుంటారు నిర్మాతలు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సూర్య.. ఆ తర్వాత ‘24’ మూవీలో మూడు పాత్రల్లో కనిపించారు. కాగా ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు అని టాక్.

వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలతో మెప్పించేందుకు రెడీ అవుతున్నాడట సూర్య. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ‘వాడివసల్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. జల్లికట్టు నేపథ్యంలో సినిమా ఉండబోతుందని సమాచారం.

Advertisement

Next Story