పొలిటికల్ ఎంట్రీపై సూర్య..

by Anukaran |   ( Updated:2020-11-09 07:47:04.0  )
పొలిటికల్ ఎంట్రీపై సూర్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : కోలీవుడ్ హీరో సూర్య టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నటుడు. దాదాపు తను నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. లేటెస్ట్‌గా సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా!’ చిత్రం నవంబర్ 14న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుండగా.. ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెట్రిమారన్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి తెలిపిన గజినీ హీరో.. కుటుంబంలో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందని తెలిపాడు. అప్పుడే నటుడిగా చరిత్రలో మిగిలిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

ఇక కోలీవుడ్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వగా.. ఇళయ దళపతి విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ ప్రవేశంపై సూర్యను ప్రశ్నించగా.. అసలు అలాంటి ఆలోచనలే లేవని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story