- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్లీ యూఏఈ వద్దామనుకుంటున్న రైనా?
దిశ, స్పోర్ట్స్: వ్యక్తిగత కారణాలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి వైదొలగి, భారత్‌కు తిరిగొచ్చిన స్టార్ క్రికెటర్ సురేష్ రైనా మళ్లీ జట్టుతో కలవాలని భావిస్తున్నాడు. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలోనే జట్టుతో కలవాలని రైనా అనుకుంటున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘నన్ను మళ్లీ సీఎస్కే జట్టుతో మీరు చూడొచ్చు. కానీ నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి ముగిసిన తర్వాత తప్పకుండా క్రికెట్ ఆడతాను. యూఏఈ నుంచి అర్థాంతరంగా వెనక్కు రావడం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం. బయట వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే. సీఎక్కే అంటే నాకు ఒక కుటుంబం లాంటిది. మహీ భాయ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి’ అని రైనా చెప్పుకొచ్చాడు.
కాగా, రైనా తిరిగి వచ్చినా జట్టులో చేర్చుకోవాలనుకునే నిర్ణయం తనది కాదని, పూర్తిగా ధోనీ చేతుల్లోనే ఉందని సీఎస్కే యజమాని శ్రీనివాసన్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. మరిప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే రైనాకు ధోనీ మద్దతు తప్పనిసరి. గతవారం రోజులుగా రైనా కేంద్రంగా సీఎస్కేపై పలు వదంతులు బయటకు వచ్చాయి. జట్టు ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో రైనాను తిరిగి ఆహ్వానిస్తారా అనేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు.